లోక్ సభ మాజీ స్పీకర్ మృతి

Update: 2018-08-13 04:07 GMT

లోక్ సభ మాజీ స్పీకర్, సిపిఐ సీనియర్ నేత సోమనాధ్ ఛటర్జీ(89) కన్నుమూశారు. గతకొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అయన కోల్ కత్తా లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. 1929, జూలై 25న అసోంలోని తేజ్‌పూర్‌లో సోమ్‌నాథ్‌ చటర్జీ జన్మించారు. మిత్రా ఇన్‌స్టిట్యూట్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ప్రెసిడెన్సీ కాలేజీ, కలకత్తా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించారు. రాజకీయాల్లోకి రాకముందు కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1968 లో సిపిఐలో చేరిన సోమనాధ్ ఛటర్జీ. బెంగాల్ నుంచి 10 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2004 - 2009 మధ్య లోక్ సభ కు స్పీకర్ గా పనిచేశారు. అయన మృతు పట్ల పలువురు కమ్యూనిస్టు నాయకులూ, ఇతర పార్టీలకు చెందిన నేతలు సంతాపం ప్రకటించారు.

Similar News