కోన వెంకట్ ... అన్ని కోణాలలో సినిమాని చూసిన వ్యక్తి

Update: 2018-12-17 11:17 GMT

కోన వెంకట్ తెలుగు సినిమా సంభాషణల రచయిత. ఆత్రేయ వెంకట్‌కు మంచి స్నేహితుడు. పరిచయం అయిన కొత్తల్లో ఆయన ప్రేమ, అభినందన సినిమాలకు సంభాషణలు రాసేవాడు. తను రాసిన సంభాషణలూ సీన్లూ చదివి వినిపించేవాడు. ఆయన రచయిత కావడానికి బీజం ఇక్కడే పడింది. రాష్ట్ర మాజీ మంత్రి కోన ప్రభాకరరావు ఆయన తాత. రాజకీయనాయకుడైనా సినిమాలపైనా బాగా ఆసక్తి ఉండేదాయనకు. మంగళసూత్రం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఎల్వీప్రసాద్‌ ద్రోహి సినిమాలో విలన్‌గా చేశాడు.  అయితే కోన వెంకట్  యొక్క కొన్ని మాటలు...తూటాల్ల ఎన్నో పేలాయి...అందులో కొన్ని మీ కోసం.......రావు గారూ..! నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ - ఢీ సినిమాలో చారి పాత్ర (నటించినవారు బ్రహ్మానందం)................అ-అడిగాను, ఇ-ఇవ్వనన్నావు, ఉ-ఊరుకుంటానా? - సాంబలో కారెక్టర్ పాత్ర ఆస్తిని లాక్కునే సన్నివేశంలో విలన్ పాత్రధారి ప్రకాష్ రాజ్......................ఒరే, మనకు జేబులు ఎడమవైపే ఎందుకు పెడతారో తెలుసా? మనం చెయ్యి పెట్టుకున్నప్పుడు ఎడమ వైపున్న గుండె మనకు ధైర్యం చెబుతుంది - భగీరథ సినిమాలో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న సందర్భంలో హీరో రవితేజ పాత్ర ద్వారా.....................ప్రేమ అనేది బస్ జర్నీ లాంటిది. ఎప్పుడైనా దిగి వేరే బస్ ఎక్కొచ్చు. కాని పెళ్ళి ఫ్లైట్ జర్నీ లాంటిది. ఒక్కసారి ఎక్కితే మధ్యలో దిగడానికి కుదరదు - బాడీగార్డ్ సినిమాలో. శ్రీ.కో.

Similar News