ఆయన ఒక 'స్వరరాగ గంగా ప్రవాహం'

Update: 2018-12-05 11:06 GMT

కొద్దిమంది గాయకులు పాట పాడితే..ఒక తనమయత్వంకి వినేవారు పొందుతారు...అలాంటి గాయకుడే మన యేసుదాస్ గారు.  కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్ కళాకారుడు మరియు గాయకుడు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. ఏడు జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నాడు. కేరళ ప్రభుత్వం తరపున 24 సార్లు, కర్ణాటక ప్రభుత్వం నుంచి ఐదు సార్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఆరు సార్లు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి ఒకసారి ఉత్తమ గాయకుడి పురస్కారం అందుకున్నాడు. ఈయన శాస్త్రీయ సంగీతమేగాక, భక్తిగీతాలు మరియు సినిమా పాటల గాయకుడిగా సుపరిచితుడు. వివిధ భారతీయ భాషల్లో దాదాపు 40,000 పాటలు పాడాడు. తెలుగు సినీపరిశ్రమలో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. నారాయణ గురు ప్రతిపాదించిన ఒకే మతం, ఒకే కులం, ఒకే దేవుడు అన్న సిద్ధాంతాన్ని ఆయన గాఢంగా విశ్వసిస్తాడు. ఆయన చిన్నప్పటి నుంచీ తోటి వారితో అలాగే మెలిగే వాడు. మహ్మద్ రఫీ, చెంబై వైద్యనాథ భాగవతార్, మంగళంపల్లి బాలమురళీ కృష్ణ లను ఆయన బాగా అభిమానిస్తాడు. శ్రీ.కో.

Similar News