లాయర్ దీపికా రజావత్‌కు ఊహించని షాక్‌!

Update: 2018-11-15 12:47 GMT

కశ్మీర్లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలిక అసిఫాపై సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎనిమిదేళ్ల చిన్నిరి తరుపున కేసు వాదిస్తున్న లాయర్ దీపికా రజావత్ కు భారీ షాక్ తగిలింది. కేసును తీసుకున్న క్రమంలో  తన ప్రాణాలకు హాని ఉన్నట్టు గతంలో తెలిపింది. అయితే దీపీకాకు ఇక నుండి కేసు సంబంధించి ఎలాంటి సేవలు వద్దంటూ భాదిత కుటుంబం దీపికాకు ఉహించని షాక్ తగిలింది. 
ఈ కేసుపై మతపరమైన అల్లర్లు చెలరేగే అవకాశం ఉంటుందని పంజాబ్‌లోని పఠాన్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుకు సుప్రీంకోర్టు ఈ కేసును బదిలీ చేసింది. కాగా  ఈ కేసు విషయంలో దీపికా కేవలం రెండే రెండుసార్లు కోర్టులో హాజరయ్యానని ఇలా అయితే నాకు న్యాయం జరగదని తండ్రి భావిస్తున్నట్లు తన మిత్రులు తెలిపారు. ఇప్పటికి వందసార్లు కేసు విచారణకు వచ్చి, నూరుమంది సాక్ష్యులను విచారించిన ఫలితంలేకనే లాయర్ ను  మార్చుకున్నట్లు పఠాన్‌ కోర్టుకు దరఖాస్తు చేయనున్నట్లు సమాచారం.

Similar News