అరుదైన ఘనత సాధించిన కరుణానిధి

Update: 2018-08-09 02:26 GMT

 దేశ రాజకీయాల్లో రాజకీయ కురువృద్ధుడుగా పేరుగాంచిన కరుణానిధి శకం నిన్నటితో  ముగిసింది.  రాజకీయ రంగంలో అపర చాణక్యుడిగా పేరుగాంచిన కరుణ.. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో  ఆయనకంటూ ఓటమి లేదు. రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసిన నాయకుడు కలైంజ్ఞర్‌ .తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. 1957 నుంచి 13సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఐదు సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే కరుణానిధికి సీఎంగా ప్రత్యేక స్థానం ఉంది. అప్పటి నుంచి ఇప్పటివరకు దేశ ప్రధానిలుగా పనిచేసిన అందరితో కరుణానిధికి ప్రత్యేక అనుబంధం ఉంది. దాదాపు 14 మంది ప్రధానులతో సత్సంబంధాలను కొనసాగించారు. అంతేకాదు దేశానికీ స్వాతత్య్రం వచ్చిన తరువాతనుంచి ఇప్పుడు పనిచేస్తున్న ప్రధానుల వరకు అందరితో పరిచయాలున్న ఏకైన రాజకీయ నాయకుడు కేవలం కరుణానిధే. దేశంలో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి రాజకీయ వేత్త కరుణానిధి. 

Similar News