"నవరస నటనా సార్వభౌమ" !

Update: 2018-11-28 12:31 GMT

"నవరస నటనా సార్వభౌమ"  కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు. గత 40 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి సేవ చేస్తున్న ఆయన ఇప్పటిదాకా 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా ఆయన పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన "నవరస నటనా సార్వభౌమ" అనే బిరుదు పొందాడు. తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో, సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. ఆయన్ని మొదట గుర్తించింది డి.యల్.నారాయణ. 1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య. ఆ సినిమా బాక్సు ఆఫీసు దగ్గర బోల్తాపడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అక్కడి నుండి ఇప్పటి వరకు ఈ పాత్ర వేసిన అందలో పూర్తిగా జీవిస్తారు వీరు.  శ్రీ.కో.

Similar News