కాంగ్రెస్ కు షాక్.. టీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి..

Update: 2018-11-03 03:34 GMT

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది.మాజీ మంత్రి, ఆ పార్టీ కీలక నేత జలగం ప్రసాద్ రావు తెరాస లో చేరుతున్నట్టు ప్రకటించారు. కాంగ్రెస్ లో ఆరేళ్లపాటు సస్పెన్షన్ కు గురైన అయన కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నారు. పార్టీలో చేర్చుకోమని కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చినా పట్టించుకోలేదు.. దాంతో అయన టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ఆయనతో  మాట్లాడారు. పార్టీలోకి రావలసిందిగా కోరారు. కేటీఆర్ ఫోన్ తో అప్రమత్తమైన కాంగ్రెస్.. ప్రసాద్ రావుపై విధించిన సస్పెన్షన్ ను నిలిపివేస్తూ ప్రకటన విడుదల చేశారు. కానీ అప్పటికే ప్రసాద్ రావు తెరాస చేరాలని నిర్ణయం తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నామని, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదంటూ కరాఖండిగా చెప్పడంతో జలగం గులాబీ గూటికి చేరడం ఖరారైంది. శనివారం సాయంత్రం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో జలగం ప్రసాదరావు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు.

Similar News