‘అజ్ఞాతవాసి’ సినిమా విడుదలకు వారం రోజుల ముందు నుంచే తెగహడావిడి చేసింది. తీరా విడుదల తరువాత మిక్స్ డ్ టాక్ తో సరిపెట్టుకుంది. అయితే తొలిరోజు కలెక్షన్లు నాన్ బాహుబలి రికార్డులను క్రాస్ చేసింది. ఇప్పుడు అందరి చూపు సంక్రాతి బరిలో ‘అజ్ఞాతవాసి’ తరువాత బాలకృష్ణ జైసింహ పైనే ఉంది. మరి ఈ సినిమా బరిలో నిలబడుతుందా. లేదా ‘అజ్ఞాతవాసి’లా ఢీలా పడుతుందా అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే గత సంవత్సరం సంక్రాతి పండుగకు వచ్చిన పెద్ద సినిమాలు ఆశాజనక ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో జైసింహ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది. ‘అజ్ఞాతవాసి’కి మిక్స్ డ్ టాక్ రావడాన్ని ఇది ఏమేరకు సద్వినియోగం చేసుకుంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘జై సింహా’ సంక్రాంతి సీజన్ కాబట్టి టాక్ ఎలా ఉన్నా ఎ సెంటర్లలో ఎలా ఆడుతుందనడానికి టాక్ కీలకం. మరి అదెలా ఉంటుందో చూడాలి.