జగన్‌పై హత్యాయత్నం : అన్ని పిటిషన్లపై నేడు విచారణ

Update: 2018-11-09 03:05 GMT

గతనెల విశాఖ ఎయిర్పోర్టులో వైసీపీ అధినేత జగన్‌పై హత్యాయత్నం ఘటన కేసుపై ఇవాళ హైకోర్టులో విచారణ  జరగనుంది. అన్ని పిటిషన్లను కలిపి విచారణ జరగనుంది. తనపై హత్యాయత్నం కేసులో రాష్ట్ర ప్రభుత్వంతో ఇన్వాల్మెంట్ లేకుండా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ.. గతవారం జగన్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. ఇవాళ మరోసారి వాదనలు విననుంది. మరోవైపు ఈ కేసును స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలంటూ వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు అనిల్‌కుమార్‌, అమర్‌నాథ్‌ రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఇవన్నీ కలిపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందుకు రాగ. స్వయంగా బాధితుడే రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసినప్పుడు మిగతా పిటిషన్లు  ఎందుకని కేసు విచారణ సందర్భంగా ప్రశ్నించింది. కాగా వీటన్నింటిని కలిపి విచారణ జరుపవచ్చా లేదా అంశంపై కోర్టు ఇవాళ విచారణ చేయనుంది ధర్మాసనం. 

Similar News