ఐటి ఉద్యోగాల ఉప్పెన వస్తోంది

Update: 2018-08-10 11:02 GMT

విశాఖపట్టణం ఇక మునుముందు కాబోతోందట,

ఎందరికో ఐటి ఉద్యోగాల సముద్ర పట్టణమట,

మంత్రిగారి ప్రకారం 2019లోగా లక్ష ఐటీ ఉద్యోగాలట 

2024కి ఏపీలో నిరుద్యోగులు వెతికినా వుండరట. శ్రీ.కో
 


ఏపీకి వస్తున్న ఐటీ కంపెనీల్లో 60 శాతం విశాఖపట్టణంలోనే ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 వేల ఐటీ ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. 2019లోగా లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. 2024 నాటికి ఏపీలో నిరుద్యోగులు ఉండరని ఆయన అన్నారు. 2019లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందని లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
 

Similar News