ప్రకృతి ప్రకోపానికి 429మందికి చేరిన మృతులు

Update: 2018-12-25 13:01 GMT

ఇండోనేషియాలో ప్రకృతి ప్రకోపం తీరని శోకాన్ని మిగిల్చింది. అగ్నిపర్వతం బద్దలవడంతో గత శనివారం రాత్రి సునామీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 429కు చేరింది. మరో 1400 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా 128 మంది గల్లంతైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సునామీ కారణంగా సుమత్రా, జావా తీర ప్రాంతాలు మృత్యుదిబ్బలుగా మారిపోయాయి. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సునామీ ధాటికి కుప్పకూలిన హోటళ్లు, ఇళ్ల శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని బయటకు తీసేందుకు ఇండోనేసియా సైనికులు, స్వచ్ఛంద సేవకులు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

Similar News