టీటీడీకి హైకోర్టులో ఎదురు దెబ్బ

Update: 2018-12-13 15:13 GMT

టీటీడీకి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. శ్రీవారి ఆలయంతో పాటు గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు ఆలయాల్లో అర్చకులకు రిటైర్మెంట్‌ ప్రకటించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. మిరాశీ అర్చకులకు రిటైర్మెంట్‌ వర్తించదని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఒకవేళ హైకోర్టు తీర్పును టీటీడీ అమలు చేస్తే రమణదీక్షితులుకు టీటీడీ ప్రధాన అర్చకుడిగా మళ్లీ అవకాశం వస్తుంది. అయితే, 65 ఏళ్ల వయస్సు దాటిన అర్చకులకు రిటైర్మెంట్ ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు టీటీడీకి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. మిరాశీ అర్చకులకు రిటైర్మెంట్‌ వర్తించదన్న హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్‌ చేయాలని టీటీడీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

Similar News