తడిసి ముద్దయిన హైదరాబాద్.. మరో 48 గంటలు..

Update: 2018-08-10 03:31 GMT

హైదరాబాద్‌ నగరం వర్షంతో తడిసి ముద్దయింది.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్న(గురువారం) సాయంత్రం నుంచి వర్షం కురిసింది.. మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు భారీ వర్షం పడింది.. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు నిచిలింది.. అయితే, జీహెచ్‌ఎంసీ అధికారుల అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. పలు చోట్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. కాగా మరో 48 గంటలపాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో 48 గంటలు వర్షం కురిసే అవకాశముండటంతో మేయర్ బొంతు రామ్మోహన్ అదికారులను అప్రమత్తం చేశారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

Similar News