తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు..

Update: 2018-05-13 05:08 GMT

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు వర్షాలు పడే సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ  తెలిపింది. తెలంగాణ, ఉత్తరాంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

కాగా తెలుగు రాష్ట్రాలకు వడగాలుల ముప్పు పొంచి ఉంది. ఇవాళ, రేపు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఈ ప్రభావముంటుందని తెలిపింది. ఎండల తీవ్రంగా ఉండటంతో అక్కడక్కడా...క్యూములోనింబస్‌ మేఘాల ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. 

అత్యధికంగా మంచిర్యాలలో అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌లలో 44, జగిత్యాలలో 43.9, నిర్మల్‌లో 43.8, కరీంనగర్‌లో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్‌లో 40.2 డిగ్రీల ఉష్ణోగత నమోదైంది. ఈ ఉష్ణోగ్రతలు ఇవాళ కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయ్. ప్రజలు అప్రమత్తంగా వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Similar News