నేడు వున్నాయట అతి భారీ వర్షాలు

Update: 2018-08-20 05:49 GMT

ఈరోజు తెలంగాణలో వున్నాయట అతి భారీ వర్షాలు,

హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం నుండి వచ్చే వార్తలు. 

బంగాళాఖాతంలో వచ్చెనట అల్పపీడనం ప్రభావాలు,

ఇప్పటికే ఎన్నో ప్రాంతాల్లో కురుస్తున్నాయి జల్లు వర్షాలు. శ్రీ.కో


ఈరోజు రాష్ట్రంలో సోమవారం పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర ప్రాంతాల జిల్లాలపై నైరుతి రుతుపవనాలు కదలికలు చురుగ్గా ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ సమీపతీరం.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అల్పపీడనం తీవ్రత సోమవారం మరింత పెరిగే అవకాశాలున్నాయి. మరోవైపు ఉత్తర కర్ణాటక ప్రాంతంలో భూమికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఆదివారం ఉదయం నుంచి రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలిలో తేమ పెరిగి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.
 

Similar News