తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు సిద్ధిపేటలో ఎదురులేకుండా దూసుకుపోతున్నారు. సిద్ధిపేటలో కౌంటింగ్ నాలుగో రౌండ్ ముగిసేసరికి హరీశ్ ఏకంగా 26,098 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మెజార్టీకి కేరాఫ్ అడ్రస్ తన్నీరు హరీష్ రావు. తాజా ఎన్నికల ఫలితాల్లో సైతం ఆయన మరోసారి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో 93,328 ఓట్ల రికార్డు స్థాయి మెజార్టీ సాధించిన హరీష్ రావు ఈ సారి కూడా ఆ రికార్డు బ్రేక్ చేసేలా ఉన్నారు. ప్రజాకూటమి తరఫున బరిలోకి దిగిన భవాని రెడ్డి ఏమాత్రం పోటీనివ్వలేకపోయారు. ఇప్పటికే ఇక్కడి నుంచి ఐదు సార్లు ఘనవిజయం సాధించిన హరీష్రావు ఆరోసారి కూడా భారీ ఆధిక్యం సాధించనున్నారు.