గ్రేట్ వర్క్ గయ్స్: లోకేష్

Update: 2018-04-30 10:31 GMT


రంగస్థలం  సినిమా ఐటీ- పంచాయితీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ కి తెగ నచ్చేసిందట. వీలు దొరకడంతో  ‘రంగస్థలం’ సినిమా చూసిన నారా లోకేష్ ... చిత్ర బృందాన్ని పొగుడుతూ ట్వీట్టర్ లో ఓ పోస్టు చేశాడు.  ‘తెలుగువారికి రంగస్థలం వంటి మంచి చిత్రాన్ని అందించిన దర్శకుడు సుకుమార్ కీ- హీరో రామ్ చరణ్ కీ హ్యాట్సాఫ్! ’ అంటూ పోస్టు చేసిన నారా లోకేష్.
 గ్రేట్ వర్క్ గయ్స్! అంటూ పొగడ్తల్లో ముంచేశాడు. మెగా పవర్ స్టార్ చరణ్  ‘ధన్యవాదాలు లోకేష్ గారూ...’ అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో తెలుగులో పోస్టు చేశాడు.
 

Similar News