మరోసారి గవర్నర్ పాలన.. బాధ్యతలు చేపట్టిన గవర్నర్!

Update: 2018-06-21 04:49 GMT

జమ్మూకశ్మీర్‌లో ఎనిమిదవసారి గవర్నర్ పాలన విధించారు రాష్ట్రపతి.ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ పంపిన నివేదికను ఆమోదించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వెంటనే ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ)తో మూడున్నరేండ్ల పాటు సాగిన పొత్తుకు బీజేపీ మంగళవారం గుడ్‌బై చెప్పింది. దీంతో మొహబూబా ముఫ్తీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పడిపోయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేనందున గవర్నర్ పాలన విధించాలని గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రాకు  రాష్ట్రపతి స్పష్టం చేశారు. దీంతో గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా వెంటనే విధుల్లోకి దిగారు.బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Similar News