గజల్ శ్రీనివాస్ కెరియర్ ముగిసినట్లేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పంజాగుట్టలోని ఓ వెబ్ రేడియోలో ప్రొగ్రామ్ హెడ్‌గా పని చేస్తున్న ఓ యువతిని లైంగికంగా వేధించిన విషయంలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో బెయిల్ మీద భయటకు రావాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. రెండుసార్లు బెయిల్ కి అప్లయ్ చేసిన నాంపల్లి కోర్ట్ తిరస్కరించింది. బెయిల్ మీ భయటకొచ్చిన ఆయన జీవితం ప్రశ్నార్ధకమే. గజల్ తో ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీనివాస్ పలు ఆధ్యాత్మిక సంస్థలకు బ్రాండ్ అంబాసీడర్ గా కొనసాగుతున్నాడు. అయితే తన గలీజు వ్యవహారంతో ఆ ఆధ్యాత్మిక సంస్థలు ఆయన్ని బ్రాండ్ అంబాసీడర్ పోస్ట్ నుంచి తొలగించివేస్తున్నాయి. ‘సేవ్ టెంపుల్స్,ఆనందలహరి సాంస్కృతిక సంస్థలు తొలగించగా మరికొన్ని సంస్థలు ఇదే బాటలో ఉన్నాయి. ఇదిలా ఉంటే గజల్ శ్రీనివాస్ ‘సామాజిక వర్గం’ సైతం ఆయన మీద ఆగ్రహంతో వుంది. దీంతో.. కస్టడీ ముగిసి.. బెయిల్ దొరికి.. బైటికొచ్చిన తరువాత గజల్ శ్రీనివాస్ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది.