పరారీలో గాలి జనార్ధన్‌రెడ్డి

Update: 2018-11-07 10:34 GMT

కర్ణాటక మాజీ మంత్రి, గనుల అక్రమ తవ్వకం కేసు నిందితుడు గాలి జనార్ధన్‌రెడ్డి మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఈడీ అధికారికి లంచం ఇచ్చిన వ్యవహారంలో ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా గాలి జనార్ధన్‌రెడ్డి అంబిడెంట్ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంబిడెంట్‌ను ఎన్‌పోర్స్‌మెంట్ దాడుల నుంచి కాపాడేందుకు ఆ కంపెనీతో గాలి భారీ మొత్తంలో డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ఈడీ అధికారికి గాలి జనార్ధన్‌రెడ్డి కోటి లంచం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిఫలంగా ఆయన అంబిడెంట్ కంపెనీ నుంచి 57 కిలోల బంగారు కడ్డీలు అందుకున్నారని సమాచారం. పరారీలో ఉన్న గాలి జనార్ధన్‌రెడ్డిని పట్టుకోడానికి పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఆయన కోసం వేట కొనసాగుతోంది.
 

Similar News