ఉచితబియ్యం పథకంపై మద్రాస్ హైకోర్టు మెట్టికాయ‌లు

Update: 2018-11-23 10:11 GMT

తమినాడు సర్కార్ ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన ఉచిత బియ్యం పథకాన్ని మద్రాస్ ‍హైకోర్టు తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించింది. ఇలాంటి పథకాలు చేపడితే రాష్ట్రంలో ప్రజలు మరీ బద్దకస్తులుగా తయారైతని మోట్టికాయలు వెసింది. ఇక ఇలాంటి ఉచిత పథకాలు చేపట్టినంత కాలం ప్రజలు కాలుమీద కాలువేసుని ఉంటారని, పని కూడా వెళ్లల్సిన పని లేదని, ఉచిత పథకాలు ప్రజలు ఆకర్షితులై దిన కూలికి సైతం వెళ్లడంలలేదని మద్రాస్ హైకోర్డు మండిపడింది. ఉచితంగా బియ్యం పంపిణీ చేయడానికి తాము వ్యతిరేకం కాదని అయితే ఇలాంటి పథకాలు పేద నీరుపేద వర్గాలకు చెందితే సంతోషమేనని స్పష్టం చేసింది. ఆర్థిక స్థితిగతులతో ప్రమేయం లేకుండా అందరికి ఫ్రిగా బియ్యం ఇయ్యడం సరికాదని తేల్చిచెప్పింది. సబ్సిడీబియ్యం అక్రమరవాణా కేసులో జైలుపాలైన నిందితుడు దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా శుక్రవారం హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పేదలు కాకుండా పక్కవాళ్లు లబ్ధి పొందితే అనవసరంగా ప్రజలసొమ్మును ఇతరులకు కట్టబెట్టినట్టు అవుతుందని అభిప్రాయం వ్యక్తంచేసింది. ఒకపూట తింటే ఒకపూట తినక అతికష్టమ్మీద బతుకులు గడుపుతున్న వారికి మాత్రమే ఉచిత బియ్యం పంపిణీ చేయాలని బల్లగుద్ది చెప్పింది.

Similar News