ఫేస్ బుక్ లో మ‌రిన్ని మార్పులు

Update: 2018-01-15 00:09 GMT

ఫేస్ బుక్ లో కొన్నిమార్పులు చేస్తున్న‌ట్లు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జూక‌ర్ బ‌ర్గ్ తెలిపారు. పేస్ బుక్ లో తామిచ్చే స‌మాచార ప‌ద్ద‌తిలో మార్పులు చేస్తున్న‌ట్లు సూచించారు. ఇన్నిరోజులు వ్యాపార లావాదేవీల‌కు సౌక‌ర్యంగా ఉండేద‌ని ..కానీ దీన్ని మార్పులు చేసి ఫ్రెండ్స్ , ఫ్యామిలీ స‌భ్యులు మాట్లాడుకునేలా స‌రికొత్త ఫీచ‌ర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. . ఈ సంద‌ర్భంగా  ప్రజల మంచి చెడులు చూసేందుకు, వారి సంక్షేమం కోసం ఫేస్‌బుక్‌ పని చేస్తుందని చెప్పాల్సిన బాధ్యత తమపై వుందని తాను, తన బృందం అభిప్రాయపడినట్లు జుకర్‌బర్గ్ చెప్పుకొచ్చారు.  కాగా  ఫేస్ బుక్ లో ఈ మార్పులు స‌హ‌జ‌మ‌ని చెప్పిన ఆయ‌న   వ్యాపార సంస్థ‌లు ఫేస్ బుక్ ను ఉప‌యోగించ‌క ప‌ర్వాలేదు. ప్ర‌జ‌ల‌కు అనుగుణంగా ఉంటే చాల‌ని అన్నారు. 

Similar News