జమ్మూ కశ్మీర్‌లో మళ్ళీ అలజడి..

Update: 2018-08-24 10:47 GMT

కశ్మీర్‌లో బక్రీద్ పండగ సందర్భంగా ప్రార్థనల అనంతరం కొందరు రోడ్లపైకొచ్చి పాకిస్తాన్ జెండాలను ఊపుతూ హడావిడి చేశారు. కొందరు ఐసిస్ జెండాలను చేతపట్టుకుని పరుగులు తీశారు. కనిపించిన వారిపైకి రాళ్లు రువ్వారు. ఇక ఈ ఘటన మరవకముందే.. జమ్ముకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలకు, టెర్రరిస్ట్‌లకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కోకేర్‌నాగ్‌లోని గరోల్ ప్రాంతంలోని ఓ భవనంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమచారం అందుకున్న భద్రతా బలగాలు తెల్లవారుజామునే జవాన్లు కార్డన్ సెర్చ్ చేపట్టారు. దీంతో జవాన్లను సెర్చ్ ను పసిగట్టిన టెర్రరిస్ట్‌లు కాల్పులు జరపడంతో.. జవాన్లు కూడా ఫైరింగ్ మొదలుపెట్టారు. ఈ కాల్పుల్లో ఓ టెర్రరిస్ట్‌ను మట్టుపెట్టారు. భారీగా ఆయుధాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోనే మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ కొనసాగుతోంది. అటు, అనంత్‌నాగ్‌లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాత్కాలికంగా మొబైల్ సర్వీసుల్ని నిలిపివేశారు.

Similar News