స్టార్ క్యాంపేయినర్లకు ఈసీ షరతులు

Update: 2018-11-15 05:30 GMT

ఎన్నికలు వచ్చాయంటే చాలు స్టార్ క్యాంపేనర్లు తెరపైకి వస్తుంటారు తమకున్న షరిష్మ వాగ్దాటి. పదునైన మాటలతో అభ్యర్ధుల తరపున ప్రచారంలో ఆకట్టుకుంటారు. అయితే ఈసారి ఎన్నికల్లో స్టార్ కాంపేనర్లు ఈసీ కొత్తగా సూచనలు జారీ చేసింది. అనుమతి పొందిన తర్వాతే  క్షేత్రస్థాయిలో ప్రచారంలోకి వెళ్లాలంటోంది.

ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ మేనిఫెస్టో పథకాలతో స్టార్ క్యాంపేనర్ల ప్రచారాంతోనే ప్రజల్లోకి వెళ్తుంటారు రాజకీయ పార్టీల నేతలు. ప్రచారం సందర్భంగా స్టార్ క్యాంపేనర్లు చెప్పే మాటలతో ప్రజలు ఆకర్షితులవుతారన్నది రాజకీయ పార్టీల నేతల నమ్మకం. తాజాగా ఈ స్టార్ క్యాంపేయినర్లకు ఎన్నికల కమిషన్ చెక్ పెట్టింది. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ప్రచారం చేస్తామంటే కుదరదు వారికి కొన్ని షరతులు ఉన్నాయంటుంది ఈసీ.

రాజకీయ పార్టీలు అభ్యర్ధుల తరపున నియోజకవర్గాల్లో పోటీ చేసే స్టార్ క్యాంపేయినర్లు ముందుగా తమ వివరాలు ఈసీకి సమర్పించాలని సూచనలు జారీ చేసింది. ప్రచార సమయంలో ఎవరెవరు పాల్గొంటున్నారు వారు వినియోగిస్తున్న వాహనాల నెంబర్లు వాటి రిజిష్ట్రేషన్ పత్రాలు డ్రైవర్ కు సంబంధించిన లైసెన్స్ ఆధార్,. రెసిడెన్షియల్ సర్టిఫికెట్ల జాబితాను ఎన్నికల సంఘానికి అందచేయాలని నిబంధనలు జారీ చేసింది. 

ఇప్పటికే టీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల స్టార్ క్యాంపేయినర్ల లిస్ట్ ను ఈసికి అందచేసింది. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ తో పాటు కడియం శ్రీహరి, మహమ్మూద్ అలీ, కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్, పల్లా రాజేశ్వర్, కవిత సహా మొత్తం పదిహేను మంది వివరాలను ఎన్నికల కమిషన్ అనుమతి కోసం సమర్పించారు. బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడుతో పాటు మొత్తం 40 మంది ఇచ్చిన లిస్టును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు రాష్ర్ట ఎన్నికల సంఘం అధికారులు. స్టార్ క్యాంపెనర్స్ కు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తప్పని సరి చేయడంతో రాజకీయ పార్టీల నేతలు కొందరు ఆసహనంతో ఉన్నారు.. కొత్త కొత్త నిబంధనలతో ఓటర్లను కలుసుకోవడం కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు.

Similar News