అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేయనున్న ఉద్యోగుల ఓట్లు

Update: 2018-12-06 05:44 GMT

ఎన్నికల విధుల్లో  పాల్గోనే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే  పోస్టల్ బ్యాలెట్ లెక్క తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా  లక్షా అరవై వేలా మంది సర్కార్ ఉద్యోగులు విధుల్లో పాల్గోంటున్నారని వారిలో దాదాపు 80 వేల మందికి పైగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌కి ధరఖాస్తు చేసుకున్నారని ఈసీ తెలిపింది. 

ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించేదే పోస్టల్ బ్యాలెట్. ఓటర్ల కంటే ముందుగానే ఎన్నికల సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ఈ పోస్టల్ బ్యాలెట్ వల్ల కలగనుంది. డిసెంబర్ 7న రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల విధుల్లో పాల్గోనే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌఖర్యం కల్పించనున్నది ఎన్నికల కమిషన్. విధుల్లో పాల్గోంటున్న వారిలో దాదాపు 50 శాతం మంది ఉద్యోగులు తమకు పోస్టల్ బ్యాలెట్ సౌఖర్యం కావాలని ఈసికి ధరఖాస్తు చేసుకున్నారు.  

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం నవంబర్ 30తో ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 60 వేల509 లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ప్రతి ఉద్యోగి తన ఓటు ను తప్పక వినియోగించుకునాలన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్‌ వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నది. 

డిసెంబర్‌ 7న జరిగనున్న ఎన్నికల్లో విధులలో ఉఫాద్యాయులు, రెవిన్యూ, పంచాయతీరాజ్‌, ఎన్జీవోలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన బీఎస్‌ఎన్‌ఎల్‌, పోస్టల్‌ సిబ్బంది, సింగరేణి కార్మికులు ఎన్నికల్లో విధులు నిర్వహించనున్నారు. వంద శాతం పోలింగ్‌ జరగాలన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్‌ ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు సైతం గెలుపును ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. దీంతో వారిని రాజకీయ పార్టీలు అనుకూలంగా మలుచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి

Similar News