తెలంగాణ జీవనమే ఆయన చిత్రాలు

Update: 2018-12-18 10:00 GMT

కొద్ది మంది దర్శకులు వారి ప్రాంత సమస్యలనే సినిమా కథగా తీసుకున్న...దానికి ప్రపంచమంత గుర్తించేలా చేస్తారు. అలా ప్రపంచ చలన చిత్రపటంపై తెలంగాణ సినిమాకి ప్రత్యేక గుర్తింపును తెచ్చిన కళాత్మక చిత్రాల దర్శకుడు బి. నరసింగరావు. ఇంటిపేరు బొంగు. నిర్మాతగా, నటుడిగా, దర్శకుడిగా, స్వరకర్తగా, పెయింటర్‌గా, కవిగా ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈయన మెదక్ జిల్లా ప్రజ్ఞాపూర్లో 1946లో జన్మించారు. ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా వాటి ప్రభావం, ప్రత్యేక ముద్ర మాత్రం విశ్వానికి వ్యాపించింది. తెలంగాణ జీవన చిత్రాలనే తన సినిమాలుగా రూపొందించిన అచ్చమైన స్వచ్ఛమైన ప్రజాకళాకారుడు. ఆయన. ఆయన తీసిన ఒక్కో సినిమా ‘తెలంగాణ సినిమా’కు ఓ గ్రామర్, బలమైన పునాదిని సృష్టించింది. రంగుల కల, దాసి (1988 సినిమా), మట్టి మనుషులు, సినిమాలే అందుకు ఉదాహరణ. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బీఎన్ రెడ్డి జాతీయ అవార్డును ఇచ్చి సత్కరించింది. నాలుగు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, మరియు అనేక అంతర్జాతీయ గౌరవాలు పొందారు. మా భూమి సినిమాను 1979 లో కైరో మరియు సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్స్, కార్లోవీ ఫిల్మ్ ఫెస్టివల్ లో వారీ ప్రదర్శించారు. 1989లో దాసి, 1991లో మట్టి మనుషులు మాస్కో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో మెరిట్ అవార్డు డిప్లొమా గెలిచింది. మా ఊరు హంగేరి అంతర్జాతీయ ఉత్సవంలో మీడియా వేవ్ అవార్డును గెలుచుకుంది. ఈయన దర్శకత్వం వహించిన హరివిల్లు (ఫిచర్ ఫిల్మ్) 2003 లో 56 వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైనది. శ్రీ.కో.

Similar News