డా. దాసరి నారాయణరావు..దార్శనికుడు

Update: 2018-11-30 10:15 GMT

అందరి వాడు... అందరి మంచి కోరేవాడు..దర్శకరత్నగా ఎప్పటికి నిలిచినా వాడు...మన డా. దాసరి నారాయణరావు గారు. వీరు  తెలుగు సినిజగత్తుకు చెందిన సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత మరియు రాజకీయనాయకుడు. అత్యధిక చిత్రాల దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కాడు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 53 సినిమాలు స్వయంగా నిర్మించాడు. ఈయన 250 పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా లేదా గీతరచయితగా పనిచేశాడు. తెలుగు, తమిళంమరియు కన్నడ భాషా చిత్రాలలో నటించి, తన నటనకుగాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటునిగా బహుమతి కూడా పొందాడు. దాసరి సినిమాలు తాతా మనవడు, స్వర్గం నరకం, మేఘసందేశం, మరియు మామగారు ఈయనకు అనేక అవార్డులు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలు ముఖ్యముగా స్త్రీ ప్రధానముగా ఉండి వరకట్న సమస్యకు వ్యతిరేకముగా సందేశాత్మకంగా రూపుదిద్దబడినవి. దాసరి తిసిన బొబ్బిలి పులి మరియు సర్దార్ పాపారాయుడు చిత్రాలు నందమూరి తారక రామారావు రాజకీయప్రవేశములో ప్రధానపాత్ర వహించాయి. మామగారు, సూరిగాడు మరియు ఒసేయ్ రాములమ్మా చిత్రాలు దాసరి నటనా కౌశలానికి మచ్చుతునకలు. ఈ సినిమాలలో నటనకు దాసరి అనేక విమర్శకుల ప్రశంసలు మరియు బహుమతులు అందుకున్నాడు. శ్రీ.కో.

Similar News