గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కులా ఉన్న దానం నాగేందర్...హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా లేఖను పీసీసీ చీఫ్‌కు పంపినట్లు సమాచారం. ఏఐసీసీకి సైతం రాజీనామా లేఖను పంపినట్లు తెలుస్తోంది.
2004లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో...రాత్రికి రాత్రే తెలుగుదేశం పార్టీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. ఆ ఎన్నికల్లో దానం నాగేందర్ విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో....ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి...వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో మంచి పట్టు సాధించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది...వైఎస్ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. వైఎస్‌కు ముఖ్య అనుచరుడిగా కొనసాగుతూనే....గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత....టీఆర్ఎస్ ప్రభంజనంలో 2014 ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.