బలపడిన వాయుగుండం.. హెచ్చరికలు జారీ..

Update: 2018-10-10 01:46 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమమంగా బలపడుతోంది. ఈ వాయుగుండం కళింగపట్నానికి ఆగ్నేయంగా 510 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండంగా కేందీకృతమై ఉందని వాతావరణ కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇది మరింత బలపడి నేటి ఉదయానికల్లా తుఫానుగా మారనుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తున్న వాయుగుండం ఈనెల 11న కళింగపట్నం గోపాల్‌పూర్‌ల మధ్య తీరం దాటే అవకాశం ఉంది.దీని ప్రభావం రాష్ట్రంలో ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాపై ఉంటుంది. మత్స్యకారులను వేటకు వెళ్ళొద్దని హెచ్చరించారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం పోర్టుల్లో 3వ నెంబర్ సూచికను మిగిలిన పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు వాతావరణ శాఖా అధికారులు. 

Similar News