నిర్లక్ష్య ధోరణిలో కేసీఆర్ ప్రభుత్వం నడిచింది

Update: 2018-11-26 08:53 GMT

తెలంగాణ ఏర్పడి నాలుగున్నరేళ్లు దాటినా పాలనలో కొత్తదనం లేదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్య విలువలు పాతరేయబడ్డాయన్నారు. కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, నీళ్లు, నిధులు, నియామకాలు కోసం ఉద్యమం సాగిందని చెప్పారు. నిధుల కోసం తానే అప్పట్లో అసెంబ్లీలో ప్రస్థావించానని, అప్పట్లో నిజంగానే నిధులు మళ్లించబడ్డాయని చెప్పారు చాడ. నిర్లక్ష్య ధోరణిలో కేసీఆర్ ప్రభుత్వం నడిచిందని, ఖాళీ పోస్టులు భర్తీ చేయలేని అసమర్ధపానల కేసీఆర్‌దని విమర్శించారు చాడ వెంకటరెడ్డి. ఉస్మానియా విద్యార్థుల ఆవేదన చూస్తే బాధ కలుగుతోంది. ఓయూలో వర్సిటీలో కనీసం మరుగుదొడ్లు కూడా నిర్మించలేకపోయారు. కేసీఆర్‌ చెప్పేదానికి చేసేదానికి పొంతనలేదు’’ అని ఎద్దేవాచేశారు.

Similar News