గద్దర్ ను గందరగోళంలో పడేసిన కాంగ్రెస్

Update: 2018-11-20 09:17 GMT

పొడుస్తున్న పొద్దుమీద అంటూ తెలంగాణ ఉద్యమాన్ని త‌న పాట‌తో శిఖరాగ్రానికి తీసుకు వెళ్లిన ప్రజా గాయ‌కుడు, యుద్దనౌక గ‌ద్దర్. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ పరిస్థితి అయోమయంలో పడిపోయిందనే చెబుతున్నారు. ఈ ఎన్నికల బరిలో దిగాలని ప్రయత్నించినప్పటికి ఫలితం దక్కలేదని అర్థమౌతుంది. కాగా గద్దర్ తనయుడు సూర్యం బెల్లంపల్లి నుండి శాసనసభ అభ్యర్ధిగా పోటీ చేయాలని చూసినా కాంగ్రెస్ మాత్రం మహాకూటమిలో భాగంగా సీపీఐకి కేటాయించింది. కాగా ఇటు గద్దర్ కు,కుమారుడికి అన్యాయం జరిగిందనే భావనలో గద్దర్ ఉన్నట్లు విశ్లేశకులు చెబుతున్నారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్ తో గద్దర్ మంతనాలు జరిపిన ఫలితం దక్కలేదు. గజ్వేల్ నుంచి బరిలో దిగుతానని రెబల్ గా పోటీ చేస్తున్న తనకు ఆయా పార్టీలు మదద్ ఇవ్వాలని కోరారు. అనంతరం తాను పోటీ చేయబోనని - ప్రచారం మాత్రం చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. కాగా తాజాగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన స్టార్ క్యాంపైనర్ల జాబితాలో గద్దర్ పేరు లేదు. అదే సమయంలో గద్దర్ ను ప్రచారానికి సైతం ఆహ్వానించడం లేదు. ఇటు పార్టీ పరంగా గద్దర్ సేవలు వాడుకోకుండా మరోవైపు హామీ ఇచ్చినట్లు టికెట్ ఇవ్వకుండా గద్దర్ ను కాంగ్రెస్ పార్టీ గందరగోళంలోకి  నెట్టేసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
 

Similar News