కంచరపాలెంలో జీవించి నటించారా యోన్ధబ్బి?

Update: 2018-09-10 06:24 GMT

ఫుల్ మీల్స్ లాంటి నటనే కంచరపాలెం,

ఒక ఊరు.. నాలుగు ప్రేమ కథల పళ్ళెం,

దర్శకుడు వెంకటేష్ మహా వండిన వంటకం,

నటనతో వడ్డించిరి మహా నాటకం. శ్రీ.కో. 


కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలతో విసిగిపోయిన ప్రేక్షకులకి ఫుల్ మీల్స్ వినోదం కంచరపాలెం సినిమా. దర్శకుడు వెంకటేష్ మహా దాదాపు అందరు కొత్తవారితో తీసిన, ఆర్టిస్టుల దగ్గర నుండి  అదిరిపోయే పర్ఫార్మెన్స్ రాబట్టడు, ప్రతి ఒక్క పాత్ర చాలా నాచురల్ గా అనిపిస్తుంది. కంచరపాలెం లో మనం కూడా ఉన్నామన్న ఫీలింగ్ కలిగేలా దర్శకుడి టేకింగ్ ఉంది. ఈ సినిమా మొత్తం 52 మంది కొత్త వారిని పరిచయం చేశారు. నాచురల్ లొకేషన్స్ లో కూడా చాలా అందంగా సినిమా వచ్చేలా చేశారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. కథ, కథనాల్లో దర్శకుడు చేయి తిరిగిన సినిమా దర్శకుడులా తీసాడు. వెంకటేష్ మహా తన ప్రతిభ చాటాడని చెప్పొచ్చు. ఒక ఊరు.. నాలుగు ప్రేమ కథలు.. అందులో ఒక చిన్న ట్విస్ట్.. రా అండ్ రియలిస్టిక్ అనే మాటలకు కంచర పాలెం పర్ఫెక్ట్ ఎక్సాంపుల్ అని చెప్పొచ్చు. పాత్రలు నటిస్తున్నట్టుగా కాకుండా జీవిస్తున్నట్టుగా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు మన ఊరిలోనే జరుగుతున్నదా, అని అనిపించేలా కథ, కథనాలు ఉన్నాయి. ఒక ఆర్ట్ సినిమా, డాక్యుమెంటరీ లాగ అనిపించినా కథ యొక్క ఆత్మ మాత్రం చాల మందిని కదిలిస్తుంది.

Similar News