అజ్ఞాతవాసిపై కేసు న‌మోదు

Update: 2018-01-09 17:48 GMT


తెలుగు రాష్ట్రాల్లో అజ్ఞాతవాసి సినిమా సంద‌డి మొద‌లైంది. ఇప్ప‌టికే దుబాయ్ రివ్యూతో సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో  తెలిసిపోయింది.  అయితే ఆ సినిమా రిజ‌ల్ట్  ఎలా ఉన్నా వివాదాలు చుట్టుముడుతున్నాయి. కొద్దిరోజులుగా సినిమా కాపీరైట్స్ విష‌యం ఎన్ని మ‌లుపులు తిరిగిందో మ‌న‌కు తెలిసిందే. ప్రెంచ్ సినిమా కాపీ కొట్టారంటూ ఆ సినిమా నిర్మాణ సంస్థ టీసిరీస్  తెలుగు అజ్ఞాతవాసి చిత్ర యూనిట్ కు  నోటీసులు పంపింది. దీంతో న‌యానోబ‌యానో  చెల్లించి ఆ వివాదం స‌ద్దుమ‌ణిగేలా చూసుకున్నారు నిర్మాత‌. అయితే ఈ సినిమాలో ప‌వ‌న్  ‘కొడకా కోటేశ్వరరావు ఖర్సైపోతవురో… నువ్వు పులుసైపోతవురో…’ అంటూ పవన్ పాడారు. ఆపాట వ‌ల్ల త‌మ మ‌నోభావాలు తింటున్నాయ‌ని  కోటేశ్వరరావు అనే న్యాయవాది పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీంతో ఈ సినిమాపై కేసు న‌మోదు అయ్యింది. మా మ‌నోభావాలు దెబ్బ‌తిన‌కుండా ఉండాలంటే  పాటలోని కోటేశ్వరరావు అన్న పేరును తొల‌గించాల‌ని స‌ద‌రు పిటిష‌నర్ పేర్కొన్నారు. 

Similar News