జైట్లీ బడ్జెట్ ఎఫెక్ట్: మొబైల్స్ కొనడం కష్టమే

Update: 2018-02-01 09:08 GMT

మొబైల్ ప్రియులకు చేదు కబురందించారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. నిత్యావసరాల జాబితాలో చేరిన మొబైల్ ఫోన్ ధరలపై వాత పెట్టారు జైట్లీ. ఇప్పటి వరకు 15శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీ.. 20శాతానికి పెంచారు. దీంతో మొబైల్ ధరలు పెరగనున్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అన్ని ఫోన్ల ధరలు 5శాతం పెరగనున్నాయి. దేశీయంగా ఉత్పత్తి అయ్యే మొబైల్ ఫోన్ల ధరల్లో మార్పు లేదు. పూర్తిగా విదేశాల్లో తయారయ్యే.. ఇండియాలో మార్కెట్ చేసుకునే కంపెనీ ఫోన్ ధరలు పెరగనున్నాయి. బడ్జెట్‌లో మొబైల్స్‌పై కస్టమ్స్ డ్యూటీ పెంపే దీనికి కారణం. కస్టమ్స్ డ్యూటీని 15 నుంచి 20 శాతానికి పెంచారు. మేకిన్ ఇండియాలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మరోవైపు టీవీలపై కూడా కస్టమ్స్ డ్యూటీ పెరిగింది. వీటిపై పన్నును 15శాతానికి పెంచారు.
 

Similar News