బొమ్మను చేసి ప్రాణము పోసి!

Update: 2018-11-19 10:39 GMT

ఆద్యాత్మిక చింతన లేదా తాత్విక చింతన చేసేవిధముగా కూడా కొన్ని పాటలు మనని ప్రభావితం చేస్తాయి. అలా ఎంతో ఆలోచింపచేసే పాటే.. ఈ
బొమ్మను చేసి ప్రాణము పోసి అనే ఈ పాట. ఈ పాట దేవత (1965) చిత్రంలోనిది. దీనిని పాడినవారు ఘంటసాల మరియు రచించినది శ్రీశ్రీ. దీనిని ఎన్.టి.రామారావు మీద చిత్రీకరించారు. 
ముందుగా.....

బ్రతుకంతా బాధగా ... కలలోని గాధగా

కన్నీటి ధారగా.. కరిగిపోయే

తలచేది జరుగదు - జరిగేది తెలియదు
పల్లవి :

బొమ్మను చేసి ప్రాణము పోసి

ఆడేవు నీకిది వేడుకా

గారడి చేసి గుండెను కోసి

నవ్వేవు ఈ వింత చాలిక.. | | | బొమ్మను | | |
చరణం 1: 

అందాలు సృశ్టించినావు దయతో నీవు

మరలా నీ చేతితో నీవె తుడిచేవులే

దీపాలు నీవే వెలిగించినావే గాఢాంధకారాన విడిచేవులే 

కొండంత ఆశ అడియాస చేసి పాతాళలోకాన త్రోసేవులే.. | | | బొమ్మను | | |
చరణం 2: 

ఒకనాటి ఉద్యానవనము నేడు కనము

అదియే మరుభూమిగా నీవు మార్చేవులే

అనురాగమధువు అందించి నీవు హాలాహలజ్వాల చేసేవులే

ఆనందనౌక పయనించు వేళ శోకాల సంద్రాన ముంచేవులే .. | | | బొమ్మను | | | --- శ్రీశ్రీ
ఈ పాటని విని భావాన్ని అర్ధం చేసుకుంటే ఎంతో లోతైన అర్ధాలు కనబడతాయి. శ్రీ.కో.

Similar News