వైసీపీ అందుకు సహకరిస్తే..

Update: 2018-07-22 05:28 GMT

పార్లమెంటు వేదికగా టీడీపీ ఎంపీలు డ్రామాలు ఆడారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. అవిశ్వాసం వీగిపోయిన సందర్బంగా మోదీపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను దక్కించుకుని మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్టు టీడీపీ.. వైసీపీ ట్రాప్ లో పడిందన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో 600 హామీలను నెరవేర్చకుండా ప్రజలను టీడీపీ మోసం చేసిందని.. తద్వారా వైసీపీ సహకరిస్తే  టీడీపీ ప్రభత్వంపై అవిశ్వాసం పెడతామని అన్నారు మాధవ్‌. అలాగే ఎంపీలు చేత  రాజీనామాలు చేయించి పనికిరాని పక్షంగా వైసీపీ మిగిలిపోయిందన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయకుండా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడాన్ని అయన తప్పుబట్టారు.

Similar News