మంత్రి పదవికి మంజు వర్మ రాజీనామా

Update: 2018-08-09 01:54 GMT

బీహార్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముజఫర్‌పూర్‌ షెల్టర్‌ హోం స్కాండల్‌ 34 మంది బాలికలు అత్యాచారానికి గురైన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న.. సాంఘిక సంక్షేమ మంత్రి మంజు వర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె భర్త తరచూ షెల్టర్‌ హోంను సందర్శించే వారని.. ఆయన పై అంతస్తుకు వెళితే.. కింద మిగతా అధికారులు కాపలా ఉండేవారంటూ విపక్షాలు… తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాయి. బీజేపీలోని ఓ వర్గం కూడా మంజువర్మ రాజీనామాకు పట్టుబట్టింది. అటు ఈ కేసులో నిందితునిగా భావిస్తున్న ఓ వ్యక్తి సైతం మంజు వర్మ భర్త…. చందేశ్వర్‌ వర్మ… తరచూ షెల్టర్‌ హోంకు వచ్చేవారని విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో సీఎం నితిష్‌ కుమార్‌ స్ట్రాంగ్‌ కామెంట్స్‌ చేశారు. నిందితులు ఎంతటి వారైనా జైలుకు వెళ్లక తప్పదంటూ స్పష్టం చేశారు. ఇది జరిగిన కొద్ది గంటలకే మంజు వర్మ రాజీనామా సమర్పించడం ఆసక్తికర అంశం 

Similar News