రేలంగి గారి తర్వాత వీరు అంతే పేరు తెచ్చుకున్నారు...

Update: 2018-11-29 07:05 GMT

ఒకప్పటి గొప్ప హాస్య నటుల్లో ఒకఋ...మన పద్మనాభం. హాస్యనటుడిగా ప్రసిద్ధిపొందిన బి.పద్మనాభం ఒక ప్రముఖ  సినిమా మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు. ఈయన తొలి తెలుగు సినిమా విడుదలైన సంవత్సరం 1931లో ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా (ఇప్పటి వై యస్సార్ జిల్లా) పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు. తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు.ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచి పద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ ఊరి టెంటు హాలులో "ద్రౌపదీ వస్త్రాపహరణం", "వందేమాతరం", "సుమంగళి", శోభనావారి "భక్త ప్రహ్లాద" మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు.. రేలంగి గారి తర్వాత వీరు అంతే పేరు తెచ్చుకున్నారు అనటం అతిశేయోక్తి కాదేమో  శ్రీ.కో.

Similar News