బెంగళూరు టు హైదరాబాద్‌... పాలిటిక్స్‌ ఏం చెబుతున్నాయి?

Update: 2018-05-18 08:51 GMT

కర్ణాటక రాజకీయాలు...దేశవ్యాప్తంగా సెగలు పుట్టిస్తున్నాయ్. కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నాయ్. బెంగళూరు నుంచి ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌, జేడీఎస్‌లు...హైదరాబాద్‌కు ఎందుకు మకాం మార్చాయ్. మంచి సెక్యూరిటీ ఉంటుందన్న కారణంతో వచ్చారా ? లేదంటే మరేదైనా కారణం ఉందా ? హైదరాబాద్‌నే ఎన్నుకోవడానికి కారణాలేంటీ ?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలకు ముందు...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బెంగళూరు వెళ్లారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఫ్రంట్‌‌‌లో భాగస్వామ్యం కావాలంటూ మాజీ ప్రధానమంత్రి దేవేగౌడతో చర్చలు జరిపారు. దేవేగౌడ, కుమారస్వామితో చర్చలు ముగిసిన తర్వాత...తెలుగు ప్రజలంతా జేడీఎస్‌కే ఓటు వేయాలని బహిరంగ పిలుపునిచ్చారు. జేడీఎస్‌ను మంచి మెజార్టీతో గెలిపించాలని...తెలుగు ప్రజలను కోరారు.

కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించడానికి కారణాలు రెండు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌...జేడీఎస్‌ను గెలిపించాలని తెలుగు ప్రజలను కోరడం ఒకటయితే... రెండు తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్ష పాత్రను పోషించడం. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న కర్ణాటకకు చెందిన జేడీఎస్‌, కాంగ్రెస్‌లు....హైదరాబాదే బెటరని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తరలించాయ్. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న వ్యూహాంతోనే క్యాంపులు నిర్వహిస్తున్నాయ్. 

Similar News