దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆ యువనేత?

Update: 2018-01-24 07:01 GMT

ఇప్పటికే 2019 ఎన్నికలకు ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ త్వరలో మరో అబ్యర్ధిని ప్రకటించబోతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే  కుటుంభం వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటుంది. దీంతో అక్కడ ప్రత్యామ్నాయంగా మరో నేతను రంగంలోకి దిందించి వైసీపీ అధిష్టానం.. ఆయనే బాదం మాధవరెడ్డి. ఇప్పుడు ఈ పేరు రాష్ట్ర వైసీపీ నేతల్లో బలంగా వినిపిస్తుంది. అనతికాలంలోనే పార్టీలో తనదైన ముద్ర వేసుకున్న మాధవరెడ్డి వచ్చే ఎన్నికల్లో దర్శి నుంచి పోటీకి దిగుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించాయి. మూడురోజుల కిందటే మాధవరెడ్డిని నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నియమించింది వైసీపీ, జగన్ పాదయాత్ర ప్రకాశం జిల్లాలో మొదలవగానే 2019 దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవరెడ్డిని అధికారికంగా ప్రకటించే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

Similar News