Weather Report: నిప్పుల కుంపటిలా ఏపీలో ఎండల తీవ్రత

Weather Report: పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

Update: 2024-05-03 05:02 GMT

Weather Report: నిప్పుల కుంపటిలా ఏపీలో ఎండల తీవ్రత

Weather Report: ఏపీలో భానుడి ప్రతాపం ఓ రేంజ్‌లో కనిపిస్తోంది. నిప్పుల కుంపటిలా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ ఉత్తరాంధ్రలో అత్యంత వేడి వాతావరణం అండే అవకాశం ఉందని హెచ్చరించింది. కర్నూలు, కావలి, నంద్యాలలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణం కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలోని 28 మండలాల్లో తీవ్ర వడగాలులు 156 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది ఐఎండీ. అనకాపల్లి, అల్లూరి, శ్రీకాకుళం, మన్యం, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలతో కూడిన వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

Tags:    

Similar News