రేపటినుంచి ఆసియాక్రీడల సమరం

Update: 2018-08-18 15:35 GMT

రేపటినుంచి ఆసియాక్రీడలకు ఇండోనేషియా సిధ్ధమైంది. జకార్తా, పాలెంబ్యాంగ్ వేదికలుగా 15 రోజుల పాటు ఈ క్రీడాసంబరం అభిమానులను అలరించనుంది. ఈరోజు ఆరంభ వేడుకలు ఘనంగా జరిగాయి..  ఇక ఆదివారం నుండి ప్రధాన పోటీలు ఆరంభం కానున్నాయి. 45 దేశాలకు చెందిన 10వేలకు పైగా అథ్లెట్లు 58 ఈవెంట్లలో పోటీ పడనున్నారు. భారత్‌ నుంచి 572 మంది అథ్లెట్లు బరిలో ఉండగా… 36 క్రీడల్లో పోటీపడనున్నారు. గతంలో 57 పతకాలు గెలుచుకున్న భారత్‌ ఖాతాలో 11 స్వర్ణాలు, 10 రజతాలున్నాయి. అయితే ఈ సారి పతకాల సంఖ్య పెంచుకునే అవకాశాలున్నాయి. బాక్సింగ్, బ్యాడ్మింటన్ , టీటీ , హాకీ, కబడ్డీతో పాటు ట్రాక్ ఈవెండ్స్‌లోనూ పతకాలపై ఆశలున్నాయి. గత ఏడాది కాలంగా మేజర్ టోర్నీలో నిలకడగా రాణిస్తోన్న సింధు, సైనా లు  ఈసారి పథకాలు సాధించడం అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 

Similar News