ఐదు, పది కోసం చేయి చాచవద్దు

Update: 2018-12-25 11:27 GMT

ఏపీ హోంమంత్రి చినరాజప్ప పోలీస్ శాఖపై సుతిమెత్తగా ఆరోపణలు చేశారు . కోరుకున్న జీతం వస్తున్నప్పుడు  ఐదు, పది కోసం చేయి చాచవద్దంటూ పోలీసులకు హెచ్చరించారు.  న్యాయం కోసం పేదలకు అండగా నిలవాలంటూ సూచించారు.  కొందరు అధికారులు అవినీతికి పాల్పడినట్టు తన వరకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. కొందరు చేసే అవినీతి మొత్తం పోలీస్ వ్యవస్ధకే చెడ్డ పేరు తెచ్చి పెడుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవంటూ ఓకింత కటువుగానే హెచ్చరించారు .

Similar News