నేటినుంచి డీఎస్సీ పరీక్షలు.. ఐదురాష్ట్రాల్లో 124 కేంద్రాలు

Update: 2018-12-24 03:49 GMT

 ఏపీలో నేటినుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలివిడతలో స్కూల్‌ అసిస్టెంట్స్‌, పీజీటీ, ఆర్ట్‌ అండ్‌ డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌, పండిట్‌, టీజీటీ, ప్రిన్సిపాల్‌, మ్యూజిక్‌, పీఈటీ పరీక్షలు జరుగుతాయి. వీటికి దాదాపు రెండున్నర లక్షల మంది హాజరుకానున్నారు. ఇక రెండోదశలో ఎస్‌జీటీ పరీక్షలకు మూడున్నర లక్షల మంది హాజరుకానున్నారు. కాగా డీఎస్సీ లోని అన్ని కేటగిరీల్లో 7,902 పోస్టులకు గాను.. మొత్తం 6 లక్షలకు పైగా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో  5లక్షల 90 వేలమంది అర్హత సాధించారు. దాదాపు 19వేల మంది ‘టెట్‌’లో క్వాలిఫై కానందున డీఎస్సీ అర్హత కోల్పోయారు. డీఎస్సీ పరీక్షలకోసం ఐదు రాష్ట్రాల్లో124 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏపీలో 113, ఒడిసాలో 3, తెలంగాణలో 4, బెంగుళూరులో 2, చెన్నైలో 2 కేంద్రాలు ఉన్నాయి. 

Similar News