ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం సమావేశం ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు జరగనుంది. కేబినెట్ భేటీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఈ సమావేశంలోనే మంత్రి వర్గం అసెంబ్లీ డిజైన్లకు ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా 2014 పోలీస్ యాక్ట్‌ను సవరిస్తూ చేసిన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోనుంది. వీటితో పాటు ఏపీఐఐసీకి పలు జిల్లాల్లో భూకేటాయింపులు, రూ.4,234 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం ప్రతిపాదనపై సమావేశంలో చర్చ జరగనుంది.