కృష్ణా జిల్లా పేరు మార్చేది లేదు : అంబటి రాంబాబు

Update: 2018-05-03 06:05 GMT

తాము అధికారం లోకి వస్తే కృష్ణా జిల్లా పేరును కాస్త నందమూరి తారకరామారావు జిల్లాగా మారుస్తామని వైసీపీ అధినేత  వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు సాక్షిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ  వైసీపీ సీనియర్ నేత ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా జిల్లా పేరు మార్పు ఉండదు, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి పార్లమెంటు నియోకవర్గాన్ని జిల్లాగా ప్రకటిస్తామని జగన్ ఇదివరకే హామీ ఇచ్చారని గుర్తుచేశారు..  అందులో భాగంగా ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు పామర్రు నియోజకవర్గంలో ఉందని అది మచిలీపట్నం పార్లమెంట్ కిందకు వస్తుందని దాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేసి ఆ జిల్లాకు నందమూరి తారకరామారావు జిల్లాగా నామకరణం చేస్తామని చెప్పారు. ఇది పార్టీ నిర్ణయమని అందరూ దీనికి కట్టుబడి ఉండాలని చెప్పారు. ఎన్టీఆర్ తమ పార్టీ వారు కాకపోయినా రాజనీతిజ్ఞత దృక్పధంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు. 

Also Read : వైసీపీ ఎమ్మెల్యే పై ఏసీబీ కేసు నమోదు

Similar News