కృష్ణాజిల్లాలో క్రూరత్వం.. మూడేళ్ల పసిబిడ్డపై..

Update: 2018-07-10 07:04 GMT

ఎంతకీ ఏడుపు ఆపడం లేదని అభం శుభం తెలియని పసిబిడ్డపై ఓ ఆయా ప్రతాపాన్ని చూపించింది . కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం భూషణగుళ్ల అంగన్ వాడీ కేంద్రంలో మూడేళ్ల చిన్నారి ఆపకుండా ఏడ్చాడు. ఎంతకీ నోరుమూయక పోవడంతో.. ఆయా కుమారికి ఎక్కడలేని కోపం వచ్చింది. దీంతో చిన్నారి నోట్లో కారం పెట్టి.. అరవకుండా నోరు మూసేసింది. ఈ తతంగాన్ని  చూసిన స్థానికులు.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో.. వారు అంగన్ వాడీ కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న అధికారులు.. ఆయా కుమారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో.. వారు ఆందోళన విరమించారు.

Similar News