నేనెక్క‌డికి పారిపోలేదు : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుపై యాంక‌ర్ ప్ర‌దీప్

Update: 2018-01-05 03:19 GMT

తానెక్క‌డికి పారిపోలేద‌ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుపై యాంక‌ర్ ప్ర‌దీప్ ఓ వీడియో క్లిప్ ను విడుద‌ల చేశారు. న్యూ ఇయర్‌ రోజు డ్రంకెన్‌ డ్రైవ్‌లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినప్పటి నుంచి వారం రోజుల్లోపు కౌన్సిలింగ్‌‌కు రావాల్సి ఉంటుంది. కానీ మూడ్రోజులైన ప్రదీప్‌ హాజరుకాలేదు. ఇంటికి, ఆఫీస్‌కు తాళాలు వేయడంతో పాటు ప్రదీప్‌ ఫోన్‌ స్విచ్చాఫ్ కావడంతో  పరారీలో ఉన్నట్లు  వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ప్రదీప్ కౌన్సెలింగ్‌ కు హాజరు కాకుంటే ఛార్జీషీట్ దాఖలు చేసి వారెంట్ జారీ చేసి, కౌన్సెలింగ్ ఇచ్చాకే కోర్టులో ప్రవేశ పెడతామని పోలీసులు చెప్పారు. ప్రదీప్ చర్యను బట్టి తమ తదుపరి చర్యలు ఉంటాయ‌న్న పోలీసుల హెచ్చ‌రిక‌తో  కౌన్సిలింగ్‌కు వస్తాడా రాడా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. 
ఈ నేప‌థ్యంలో ప్ర‌దీప్ ఓ వీడియోను విడుద‌ల చేశాడు..తానెక్క‌డికి పారిపోలేద‌ని, షూటింగ్ బిజీ షెడ్యూల్ కార‌ణంగా హాజ‌రుకాలేద‌ని చెప్పాడు. డ్రండ్ డ్రైవ్ కేసు గురించి త‌న‌పై అనేక అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయని..వాటిని  ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఇక త‌ప్ప‌తాగి డ్రైవింగ్ చేసి త‌ప్పు చేశాన‌ని అంగీక‌రించాడు. అంతేకాదు తాను డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిబంధనలు ఉల్లంఘించిన మాట వాస్తవమే. త‌ప్ప‌కుండా పోలీసుల కౌన్సెలింగ్ కు హాజ‌రవుతాన‌ని హామీ ఇచ్చాడు. నేను చేసిన తప్పు మరెవరూ చేయకూడదు. ’ అని పేర్కొంటూ క్లిప్‌ను విడుదల చేశారు.

Similar News