అళగిరి సంచలన ప్రకటన

Update: 2018-08-31 03:05 GMT

కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి సంచలన ప్రకటన చేశారు. తనను డీఎంకే పార్టీలో 
తిరిగి చేర్చుకుంటే తమ్ముడు స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తానని అన్నారు. సెప్టెంబరు 5న చెన్నైలో తనకు మద్దతు తెలుపుతున్న కార్యకర్తలతో ప్రదర్శన జరిపి తన బలాన్ని నిరూపించుకోడానికి  ప్రయత్నాలు చేస్తున్న అళగరి.. ఇప్పటికే కొందరు నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మాత్తుగా స్టాలిన్‌ నాయకత్వాన్ని అంగీకరిస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. త్వరలో జరగబోయే మౌన ప్రదర్శనకు సరైన మద్దతు లభించని కారణంగానే అయన ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు అళగిరిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి ఆహ్వానించేది లేదని డీఎంకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా అయన ఏ పార్టీలోనైనా చేరవచ్చంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీంతో తన సత్తా ఏంటో చూపించాలని అళగిరి భావించారు. పది.. పదిహేనుమంది ఎమ్మెల్యేలను తనవైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. గతంలో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కరుణానిధి అళగిరిని సస్పెండ్ చేశారు. దీంతో అప్పటినుంచి అయన పార్టీలోకి రావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 

Similar News