రోజూ 500 టన్నుల బత్తాయి కొంటాం-మంత్రి
చంద్రబాబుకు ప్రచార ఆర్భాటమే ఎక్కువ తప్ప.. ప్రజలకు మేలు చేసే ఉద్దేశమే లేదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. సీఎం జగన్ మాత్రం చెప్పిన దానికన్న అధికంగా రైతు భరోసా ఇస్తున్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని పనులు సీఎం జగన్ చేస్తున్నారని చెప్పారు. సీఎం జగన్ ఆదేశాలతో శనివారం నుంచి ప్రతి రోజు 500 టన్నుల బత్తాయిని కొనుగోలు చేస్తున్నామన్నారు.
ప్రభుత్వం రైతు కోసం ఇన్ని మంచి పనులు చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎందుకు అబద్దాలు చెబుతున్నారో తెలియడంలేదన్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ శంకూస్థాపన చేసిన పోలవరం ప్రాజెక్టును సీఎం జగనే పూర్తి చేస్తారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.
Update: 2020-05-17 05:48 GMT